SC, BC వసతి గృహాల్లో సమస్యలపై ఎమ్మెల్యే సీరియస్

SC, BC వసతి గృహాల్లో సమస్యలపై ఎమ్మెల్యే సీరియస్

కృష్ణా: గన్నవరం నియోజకవర్గ SC, BC వసతి గృహాల్లో సమస్యలపై MLA యార్లగడ్డ వెంకట్రావు సీరియస్ అయ్యారు. మంగళవారం గన్నవరం దావోజీగూడెం వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. భోజన నాణ్యతపై రాజీ లేదని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గీజర్లు, ఫెన్సింగ్, దోమల నివారణ, హెల్త్ చెకప్‌లు వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.