పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఘనంగా నివాళులు
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం. చెంచురామయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.