రోడ్డున పడుతున్న అరటి రైతులు
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే నాణ్యమైన అరటికి చిరునామా. ఇక్కడి జీ- 9 రకం అరటి పండ్లు ఖండాతరాలు దాటి విదేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ ఇప్పుడు అదే అరటి రైతు కళ్లల్లో కన్నీరు తెప్పిస్తోంది. నెల రోజుల క్రితం వరకు టన్ను రూ. 26 వేల పలికిన ధర.. ఇప్పుడు రూ. 6 వేలకు పడిపోయింది. యుద్ధం సాకుతో వ్యాపారుల ఆడుతున్న మాయాజాలం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాత రోడ్డున పడుతున్నాడు.