VIDEO: తాటిచెట్టుపై పాము దర్శనం.. భక్తుల్లో భక్తిపారవశ్యం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో శ్రీ ఆలేటి ఎల్లమ్మ తల్లి తొలుత కొలువై ఉన్న మహిమగల తాటిచెట్టు వద్ద శుక్రవారం భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిచెట్టుపై పాము రూపంలో దర్శనమివ్వడంతో భక్తులు ఆనందంతో పులకించిపోయారు. అమ్మవారి మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.