రేపు అమలాపురంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: ఈనెల 25న సోమవారం అమలాపురం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.