స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం

స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 70,606 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 28,415 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, శిలాతోరణం వెలుపల వరకు క్యూలైన్ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది.