గండిపడిన పెద్ద రాయల చెరువును సందర్శించిన కలెక్టర్
TPT: కేవీబీపురం మండలం ఓలూరు పెద్ద రాయల చెరువుకు పడిన గండి ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ మేరకు గండి పడటానికి గల కారణాలపై అక్కడి ప్రజలను ఆరాతీశారు. ఈ మేరకు గండిని పూడ్చడానికి తీసుకోవలసిన చర్యలను గురించి ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అనంతరం వీలైనంత త్వరగా గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.