చాపరాయిలో వీకెండ్ సందడి
ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. జలపాతంలో సరదాగా స్నానాలు చేసి,గిరిజన మహిళలతో కలిసి దింసా నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు. బొంగులో చికెన్, కబాబ్ విక్రయాలు జోరుగా సాగాయని వ్యాపారులు తెలిపారు.