వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ కిసాన్ గంజ్‌లో కార్మికుల దాహార్తిని తీర్చేందుకు మర్చంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంక్, బోరును అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి నీటి సరఫరాను పరిశీలించిన ఎమ్మెల్యే, అసోసియేషన్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కోలా రాములు ఇతర వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.