రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: కొమరాడ మండలంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు కెమిశీలలో రూ. 23.94 లక్షల నిధులతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.