అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ప్రకాశం: మర్రిపూడి మండల కేంద్రంలో ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి పాలన సాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ చెక్కును రైతులకు అందజేశారు.