నేడు కూడా తాగునీటి సరఫరాకు అంతరాయం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం కూడా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. ద్వారకా నగర్, ఫైర్ ఆఫీస్ కాలనీ, ఎస్సీ కాలనీ, ధర్మవరం, రామచంద్రమ్మ కొండ, కోర్టు పేట, ఎన్జీవో హోం ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరగదన్నారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు.