పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం దోమకొండలో పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను సందర్శించారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న విధానాన్ని పరిశీలించి, ప్రక్రియ పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.