పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

AP: పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో హైవేపై ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దని వైసీపీ నాయకులకు పోలీసులు సూచించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో అనిల్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.