బస్సులో వృద్ధుడు ఆకస్మిక మృతి

బస్సులో వృద్ధుడు ఆకస్మిక మృతి

ASR: అరకు సంతబయలలో కూరగాయలు అమ్ముకుని గ్రామానికి తిరుగు ప్రయాణం చేస్తున్న మాదాబత్తుల అప్పారావు (67)బస్సులోనే మరణించాడు. ఏపీ 35–20037 నెంబరు బస్సు అరకులోయ షెల్టర్‌కి చేరుకున్నప్పుడు ఆయన స్పందించకపోవడంతో ప్రయాణికులు గుర్తించారు. సమాచారం అందుకున్న బస్సు సిబ్బంది అప్పారావు మరణించినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.