రేపు ఉచిత వైద్య శిబిరం

రేపు ఉచిత వైద్య శిబిరం

WNP: ఈ నెల 16న 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పానల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జనరల్ మెడిసిన్ నిపుణులు, పీడియాట్రిక్స్, ప్రసూతి, గైనకాలజీ, కంటికి సంబంధించిన వైద్య నిపుణులు వస్తారన్నారు. ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేస్తామన్నారు.