మున్సిపాలిటీలో శుభ్రతపై అవగాహన

MDK: 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం మెదక్ మున్సిపాలిటీ పరిధిలో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టారు. నిల్వ నీటిలో డెంగ్యూ, మలేరియా దోమల నివారణ కోసం నూనె బంతులు వదిలారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించి, గృహ స్థాయిలో చెత్త వర్గీకరణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.