నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు: ఎస్పీ

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు: ఎస్పీ

MHBD: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా Arrive Alive-2026 కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.