మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం: CI
MHBD: పట్టణంలోని MRO కార్యాలయం వద్ద టౌన్ CI మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా CI పలు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అనంతరం CI మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.