అలుగు ఉద్రేకం.. రాకపోకలు బంద్

అలుగు ఉద్రేకం.. రాకపోకలు బంద్

MDK: రేగోడ్ మండలం జగిర్యాల, కొండాపూర్ చెరువు అలుగు పారడంతో ఆ రోడ్డు మార్గంలో వాహన రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజలు తమ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ దారిని ఉపయోగించవద్దని సూచించారు. వర్షాల ప్రభావంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.