BRS కార్యాలయంపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం
TG: మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. ఈ ఘటన అనంతరం కేటీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడి.. ధైర్యం చెప్పారు.