అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువుల పంపిణీ

అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువుల పంపిణీ

SS: జిల్లాలోని 395 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆట వస్తువుల కిట్లను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పంపిణీ చేశారు. 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో వీటిని ప్రారంభించారు. పిల్లల మేధో వికాసానికి, శారీరక ఎదుగుదలకు ఈ కిట్లు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.