'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'
KMM: డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ(ఎం) మండల నాయకులు పొన్నం వెంకటరమణ అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో CPI(M), KVPS ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అంబేద్కర్ వెలుగులు నింపారని పేర్కొన్నారు.