తిరుపతి జాతర.. నేడు తోటి వేషం

తిరుపతి జాతర.. నేడు తోటి వేషం

TPT: తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం తోటి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. శరీరమంతా నల్లటి బొగ్గు పొడి పూసుకుని తెల్లటి బొట్టు పెట్టుకుంటారు. తల, నడుముకు వేపాకు చుట్టుకుంటారు. పాత పొరక, చాట చేతిలో పట్టుకుని ఎదురుపడిన వారిని బూతులు తిడుతూ, కొడుతూ, నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకుంటారు.