ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
KNR: జమ్మికుంట మండలం సైదబాద్ గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం చేసిన రైతు బేంబిరి కిషన్ రావు పొలాన్ని 15 మంది రైతులకు చూపించి, ఫీల్డ్ కోఆర్డినేటర్ D. రమాదేవి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.