ఈత సరదా విషాదంగా మారకూడదు: ఎస్పీ

ఈత సరదా విషాదంగా మారకూడదు: ఎస్పీ

WNP: ఈత సరదా విషాదంగా మారకూడదని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చని అన్నారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈతను నేర్చుకునే వారు, వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.