భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోబోటిక్ కిడ్స్ అందజేత
SRCL: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో భారతి ఫౌండేషన్ సేవలు ఎనలేనివని జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య పేర్కొన్నారు. భారతి ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ ప్రణీత్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు రోబోటిక్ కిట్‌ను దేవయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కిట్ విద్యార్థులలో సృజనాత్మకతతో పాటు శాస్త్ర సాంకేతికత విద్యను అందిస్తుందన్నారు.