కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

KMM: పాల్వంచలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని జలాశయాన్ని, డీర్ పార్క్‌లోని దుప్పులను పర్యాటకులు వీక్షించారు. 420 మంది పర్యాటకులు కిన్నెరసానికి వెళ్లగా.. వాహనాల ప్రవేశ రుసుం ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ.12,350 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.