ఎంపీ అభ్యర్థి నామినేషన్

ఎంపీ అభ్యర్థి నామినేషన్

ATP: అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం పార్టీ కార్యకర్తలతో అనంతపురంలోని టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్ వచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.