VIDE: ఈనెల 15న విద్యార్థులకు అవగాహన సదస్సు

NZB: 'సే నో టు డ్రగ్స్' అనే నినాదంతో మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పిస్తూ AIPSU రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తోందని ఏఐపీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ శనివారం తెలిపారు. ఈనెల 15న సోమవారం పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏఐపీఎస్యూ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 'సే నో టు డ్రగ్స్' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు.