'ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

'ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

PDPL: ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై టి.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు. నంబర్ ప్లేట్లు లేని పలు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.