మటన్ ముక్క ఇరుక్కుని వృద్ధుడి మృతి
NGKL: జిల్లాలోని బొందలపల్లి విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బుధవారం రాత్రి తాపీ మేస్త్రిలకు ఏర్పాటు చేసిన దావత్ లో లక్ష్మయ్య (65) వెళ్లాడు. అక్కడ మటన్ తింటుండగా అకస్మాత్తుగా ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందికి గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.