VIDEO: యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు

VIDEO: యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు

BHPL: టేకుమట్ల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామునే యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో క్యూలైన్లో నిలబడి వేచి చూస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొరత తీరడం లేదని రైతులు వాపోతున్నారు. పంటలకు సరిపడా సకాలంలో యూరియాను అందించకపోవడంపై ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా దృష్టి సారించి యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.