సాహితీవేత్త నరసయ్యకు కలెక్టర్ అభినందన
PDPL: ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత తూము నరసయ్య 'నేను మీ నాను' అనే పుస్తకం రచించిన సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష తన ఛాంబర్‌లో ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ కార్యక్రమాలలో నరసయ్య వ్యాఖ్యాత (యాంకర్)గా వ్యవహరిస్తూ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని కలెక్టర్ కొనియాడారు. ఆయన రాసిన కవితలు సామాజిక స్పృహ, మానవ విలువలను ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసించారు.