'సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా'

'సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా'

SDPT: ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.