విద్యుత్ షాక్‌తో గేదె మృతి

విద్యుత్ షాక్‌తో గేదె మృతి

RR: విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పందుల బెడద ఎక్కువగా ఉండటంతో పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెందింది. ఇలాంటి ప్రమాదకర చర్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, రైతులకు సురక్షితమైన పద్ధతులపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరారు.