రాజ్ భవన్ పేరు మార్పుపై సీఎం మండిపాటు
తమిళనాడు గవర్నర్ అధికారిక నివాసం పేరును రాజ్ భవన్ నుంచి లోక్ భవన్‌గా మార్చే ప్రతిపాదనపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. సమస్య పేర్లు గురించి కాదని, ప్రజాస్వామ్య సంస్థల గౌరవం గురించన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను గౌరవించడంలోనే నిజమైన జవాబుదారీతనం ఉంటుందన్నారు. శాసనసభను గౌరవించని వారు, లోక్ భవన్‌గా పేరు మార్చడం అనేది కంటితుడుపు చర్య అని దుయ్యబట్టారు.