VIDEO: విషాదం.. శిశువు మృతి
MLG: వెంకటాపురం మండలంలో విషాదం నెలకొంది. వైద్యులు లేకుండా నర్సులే ప్రసవం చేయడంతో శిశువు మరణించిన ఘటన చోటుచేసుకుంది. మర్రిగూడెంకు చెందిన సంజీవరాణి ప్రసవం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చేరింది. తాను నొప్పులు భరించలేనని, త్వరగా సిజేరియన్ చేయాలని కోరగా.. వైద్యుల పర్యవేక్షణ లేకుండా నర్సులే ప్రసవం చేశారని, దీంతో శిశువు మరణించిందని బాధితులు వాపోయారు.