ప్రొద్దుటూరులో శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం

KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు అగస్త్యేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి దేవికి కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గోపూజ, గణపతి,నవగ్రహ, మృత్యుంజయ హోమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించే పూర్ణాహుతిని సమర్పించారు.