వంశి అనుచరుడికి బెయిల్.. కానీ జైల్

కృష్ణా: గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ అనుచరుడు ఓలిపల్లి రంగాకు గురువారం రాత్రి విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడు ప్రశాంత్‌కు కూడా బెయిల్ లభించింది. అయితే ఓలిపల్లి ఇప్పటికే సత్యవర్ధన్‌పై నమోదైన మరో కేసులో రిమాండ్‌లో ఉన్న కారణంగా తక్షణం విడుదలయ్యే అవకాశం లేదు. ఈ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైల్లోనే కొనసాగనున్నారు.