అద్దంకి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారి

అద్దంకి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారి

BPT: అద్దంకి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో జాన్సన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో ఈ నెలాఖరు నుంచి అద్దంకి మున్సిపాలిటీ పరిపాలన ప్రత్యేక అధికారి ఉంటారు.