పెద్దదర్పల్లి గేటు వద్ద ప్యాచ్ వర్క్ పూర్తి
MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గేటు వద్ద 167వ జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ నెర్రెలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. విషయం తెలుసుకున్న ఆర్&బీ అధికారులు వెంటనే స్పందించి అక్కడ ప్యాచ్ వర్క్ చేపట్టి మరమ్మతులు పూర్తి చేశారు. రహదారి సమస్య పరిష్కారంతో ప్రమాదాల ముప్పు తగ్గింది. త్వరితగతిన చర్యలు తీసుకున్న అధికారులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.