పర్యటకుల కోసం ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ కార్డ్ ప్రారంభం..!

పర్యటకుల కోసం ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ కార్డ్ ప్రారంభం..!

విశాఖపట్నంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలను ఒకే కార్డ్‌తో సందర్శించేలా VMRDA 'ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ కార్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డ్ ద్వారా తొమ్మిదికిపైగా ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు సులభంగా ప్రవేశం లభిస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రవేశ రుసుం రూ. 485 నుంచి రూ. 250కి తగ్గించారు. దీనితో పర్యాటకులకు ఖర్చు తగ్గి, నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు సందర్శకులు వస్తారని పేర్కొన్నారు.