'ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి'

'ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి'

VSP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. వామనమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖలో ఆటో డ్రైవర్ల ధర్నా జరిగింది. ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వాలని, వాహన మిత్ర నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు.