ఈనెల 9న మిట్టపల్లికి కేటీఆర్ రాక

KMM: తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి ఈనెల 9న మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారు. DCMS మాజీ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర, జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.