కాజీపేటలో సీఐటీయూ కార్యకర్తల భారీ ర్యాలీ

HNK: కాజీపేట పట్టణంలో సీఐటీయూ కార్యకర్తలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆధ్వర్యంలో సోమిడి గ్రామం నుంచి కాజీపేట చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న హింస వేధింపులను అరికట్టాలని నినాదాలు చేశారు.