వేములూరి ప్రాజెక్ట్ ఎడమ కాలువకు గండ్లు

SRPT: మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామంలో ఉన్న వేములూరి ప్రాజెక్ట్ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు,పొంగి పొర్లుతుండడంతో ఆ ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువకి వరదాపురం గ్రామ సమీపంలో పలు గండ్లు పడ్డాయి. శనివారం వరద ఉధృతి తగ్గాక పొలాలకు వెళ్లిన రైతులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు.