చర్ల మండలంలో ఇసుక లారీ పల్టీ
BDK: సుబంపేట ఇసుక సొసైటీ నుంచి బయలుదేరిన ఇసుక లారీ, తేగడ తాలిపేరు గ్రామ వంతెన మూలమలుపు వద్ద ఎదురుగా ద్విచక్ర వాహనం రావడంతో నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొని లోయలో పల్టీ కొట్టింది. లారీ డ్రైవర్ లగావయ్యకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. లారీలోని ఇసుక మొత్తం నేల పాలైంది. ఇది హైదరాబాద్‌కు చెందిన TS30T8388 నంబరు గల లారీగా గుర్తించారు.