గద్వాల్‌కు నూతన మున్సిపల్ కమిషనర్‌

గద్వాల్‌కు నూతన మున్సిపల్  కమిషనర్‌

జోగులాంబ గద్వాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా జానకిరామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన గద్వాల మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు.