లారీ ఢీకొని మహిళ మృతి
SRD: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మెదక్ కు చెందిన ఎర్రోళ్ల సామ్యూల్ అతని భార్య సునీత (40) ఇద్దరు కలిసి బైక్ పై శంకర్పల్లి మండలం ఫతేపూర్ కు వెళ్ళి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి బైకును ఢీకొట్టింది. దీంతో సునీత లారీ చక్రాల కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.